1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Prakasam dist yanamadala ysrcp mptc missing

ఏపీలో అధికార వైకాపా ఎంపీటీసీ అదృశ్యం

YSRCP MPTC Missing
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార వైకాపా విజయభేరీ మోగించింది. అయితే, ప్రకాశం జిల్లా యనమదల వైసీపీ ఎంపీటీసీ శాంసన్ అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. 
 
ఆయన భార్య పరమగీతం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శాంసన్ కోసం గాలిస్తున్నారు. యద్దనపూడి ఎంపీపీ పదవి కోసం వైసీపీలో రెండు వర్గాలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో శాంసన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన భర్త శాంసన్ సోమవారం నుంచి కనిపించడం లేదంటూ ఆయన భార్య యద్దనపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్రయాణికుల అనుమతిపై స్పష్టతనిచ్చిన అమెరికా