ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (09:42 IST)

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్‌బొలెరో వాహనం నుండి కిందికి జారిపడి నలుగురు మృతి చెందారు.

బుధవారం ఉదయం గూడ్స్‌ బొలెరో వాహనంలో 10 మందికిపైగా అక్కచెరువు గ్రామంలోని ఓ పెళ్ళికి వచ్చేందుకు ప్రయాణమయ్యారు.

గాలి కోసం వాహనం వెనుకడోర్‌ను కాస్త తెరిచి ప్రయాణిస్తుండగా.. గార్లదిన్నెవద్ద హైవేపై ఎత్తుపల్లాల కుదుపుడు వల్ల వాహనం వెనుకసీట్లో కూర్చున్న నలుగురు జారి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదం పొదిలి కొనకనమిట్ల మండలం గార్లదిన్నె వద్ద చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.