సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (12:57 IST)

4 రోజుల్లో పెళ్లి.. వెడ్డింగ్ కార్డులు పంచేందుకు వెళ్లి... వరుడు మృతి

మరో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకున్న వరుడు.. పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంచేందుకు వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో జరిగింది. 
 
ఈ నెల 27వ తేదీన కదిరిలో ఎర్రదొడ్డికి చెందిన మహేష్‌ (26)కు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో బంధువులకు వివాహ పత్రికలను పంచేందుకు స్వగ్రామం నుంచి అర్థరాత్రి బయలుదేరిన మహేష్‌ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. 
 
ఈ విషయం తెలిసిన కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహేష్‌ నెల రోజుల కిందటే పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చారని, త్వరలో ఓ ఇంటివాడై కోడలితో కలిసి జంటగా వస్తాడనుకుంటే అందరిని వదిలేసి వెళ్లాడంటూ... కుటుంబీకులు, బంధువులు రోదించారు. దీనిపై స్తానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.