గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (11:09 IST)

విరిగిన మినీ ట్రక్ డోర్ : నలుగురి దుర్మరణం

ప్రకాశం జిల్లాలో ప్రమాదవశాత్తు జరిగిన ఓ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తర్లుబాడు మండలం కలజువ్వలపాడులో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. 
 
జిల్లాలోని పొదిలి మండలం అక్కచెరువు గ్రామానికి చెందిన ఓ పెళ్ళికి కొంతమంది వ్యక్తులు మినీ ట్రక్కులో బయలుదేరారు. దోర్నాల నుంచి ఒంగోలుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు మినీ ట్రక్కు డోరు విరిగిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటన సమయంలో వాహనంలో సుమారు 10మందిగా పైగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.