1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Prattipati Pulla Rao fire on YS Jagan Mohan Reddy

ఈ జన్మకు జగన్‌కు అధికారం కల : ప్రత్తిపాటి పుల్లారావు

Prattipati Pulla Rao
ఏసీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. అధికారంలోకి వస్తామంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పగటి కలలు కంటున్నారనీ, అది ఈ జన్మకు జరగదన్నారు. జగన్‌మోహన్ రెడ్డికి అధికారం ఒక పగటికల వంటిదేనన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంవైపు కన్నెత్తి కూడా చూడలేదు.. కానీ, అధికారం కోసం కలలు కంటున్నారన్నారు. వైఎస్ జగన్‌కు అధికారం పగటి కలలాగే మిగిలిపోతుందన్నారు. వైసీపీ దురాలోచనలకు మే 23న ప్రజలు తమ ఓటు హక్కుతో తగిన బుద్ది చెబుతారన్నారు. 
 
మరోవైపు ఎన్నికల కోడ్‌తో ఈసీ ఏపీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి ఈసీ ఎన్నికల కోడ్‌ను కొంత సవరించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. దేశంలో ఏపీ పట్ల ఒక ప్రత్యేక వైఖరిని ఈసీ అవలంభిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
తర్వాతి కథనం
చైనా దిగుమతులపై భారీగా సుంకాలు పెంపు