సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (16:41 IST)

ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా మోడీ నెరవేర్చారా? ఓటర్ల ప్రశ్న

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈనెల 19వ తేదీన చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ దశలో పంజాబ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పలు లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దీంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీ తరపున చండీగఢ్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. దీంతో తన భార్యకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఓ దుకాణదారుడు షాకిచ్చాడు. షాపుల వద్దకు వెళ్లి కిరణ్‌ను గెలిపించాల్సిందిగా ఓటర్లను అనుపమ్ విజ్ఞప్తి చేశారు. 
 
2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గత ఐదు సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం నెరవేర్చిందా? అని అనుపమ్ ఖేర్‌ను ఓ దుకాణదారుడు ప్రశ్నించాడు. దీంతో అనుపమ్ బిత్తరపోయి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఓటర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడని నెటిజన్లు మండిపడుతున్నారు.