సంబంధిత వార్తలు
- కాలేజీ పక్కనే వ్యభిచారం దందా.. ఎవరికీ అనుమానం రాకుండా....
- గోవా బీచ్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం... ఆంధ్రా అమ్మాయిలను తీసుకెళ్లి...
- మసాజ్ పార్లర్లో అందమైన అమ్మాయిలతో వ్యభిచారం... అమ్మాయికో రేట్ కార్డు!
- గెస్ట్‌హౌస్‌లలో చీకటి బాగోతాలు... కొన్నింట్లో వ్యభిచారం
- వ్యభిచారానికి అడ్డగా ఉమ్మడి ఖమ్మం : వాట్సాప్ ద్వారా హైటెక్ వ్యభిచారం
'స్పా' ముసుగులో హైటెక్ వ్యభిచారం... సకల సౌకర్యాలతో సర్వీస్
విజయవాడ నగరంలో స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం కొనసాగిస్తూ వచ్చారు. పైగా, స్పా సెంటర్‌కు వచ్చే కస్టమర్లకు సకల సౌకర్యాలతో కూడిన లగ్జరీ హౌస్‌లో అందమైన అమ్మాయిలను చూపించి విటులను ఆకర్షిస్తూ ఈ వ్యభిచార గుట్టును రహస్యంగా సాగిస్తూ వచ్చారు. ఈ హైటెక్ వ్యభిచార గుట్టుపై పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ వ్యభిచార గుట్టును బహిర్గతం చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నగరంలో ఇటీవలి కాలంలో స్పా, మసాజ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఫలితంగా పోటీ పెరిగింది. అయితే, కొన్ని స్పా, మసాజ్ సెంటర్ల యజమానులు తమ కేంద్రాల్లో రహస్యంగా వ్యభిచారం చేయించసాగారు.
ముఖ్యంగా, ఖరీదైన భవనాలను అద్దెకు తీసుకుని అందులో స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో హైటెక్ వ్యభిచారం నిర్వహించసాగారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని మసాజ్ సెంటర్లు, స్పాలపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పలువురు అమ్మాయిలతో పాటు విటులను, నిర్వాహకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
దీనిపై నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. స్పాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇటువంటి దందాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఉపేక్షించబోమని సీపీ హెచ్చరించారు.
