సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మసాజ్ పార్లర్‌లో అందమైన అమ్మాయిలతో వ్యభిచారం... అమ్మాయికో రేట్ కార్డు!

ఇటీవలి కాలంలో మసాజ్ పార్లర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. మసాజ్ కోసం పార్లర్లకు వచ్చే పురుషులకు అందమైన అమ్మాయిలతో వల వేసి.. వ్యభిచారం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో మసాజ్ పార్లర్ ముసుగులో అందమైన అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మసాజ్ పార్లర్లలో వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నేతృత్వంలోని ఓ బృందం ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని మసాజ్ పార్లర్‌పై ఆకస్మిక దాడులు చేసింది. 
 
ఈ దాడుల్లో మసాజ్ పార్లర్‌లో కండోమ్‌లతో పాటు అమ్మాయిల పేరిట రేట్ కార్డులు లభించాయి. యువతుల అశ్లీల ఫోటోలతోపాటు వారి రేటు ఎంత అనేది పేర్కొంటూ రేట్ కార్డులు మసాజ్ పార్లర్‌లో లభించడం సంచలనం రేపింది. 
 
ఈ మసాజ్ పార్లర్ నుంచి గతంలోనూ నలుగురు అమ్మాయిలను మహిళా కమిషన్ కాపాడింది. పశ్చిమ ఢిల్లీలోని ద్వారక, ఇతర ప్రాంతాల్లోని మసాజ్ పార్లర్లు, స్పాలపై మహిళా కమిషన్ బృందం ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వ్యభిచారం రాకెట్ బాగోతం బయటపడింది. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.