శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:31 IST)

ఉల్లి ధరకు రెక్కలు... కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి... కేజీ ధర రూ.80

ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. ఉల్లి కొనాలంటేనే జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రెండు వారాల పాటు ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేజీ ఉల్లిపాయలు రూ.50 పలుకుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కేజీ 80 రూపాయల మేర పలుకుతోంది. ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్రను వరదలు ముంచెత్తడంతో.. ఉల్లి ఉత్పత్తికి కళ్లెం పడింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. 
 
పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాల్లో నిల్వ ఉన్న ఉల్లిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ప్రభుత్వం కోరింది. అలాగే, కనీస ఎగుమతి ధరను పెంచి, ప్రోత్సాహకాలు ఉపసంహరించడం ద్వారా ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది. 
 
నిత్యం ఆహారంలో ఉపయోగించే ఉల్లి ధరలు పెరగడంపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.