సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (19:54 IST)

విజయ్‌తో ఆ సంబంధం లేదన్న రష్మిక.. ఎన్టీఆర్‌తో? (video)

కన్నడ భామ రష్మిక మందనపై అప్పుడే వార్తలు మొదలయ్యాయి. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండతో రష్మిక మందన రెండోసారి కలిసి నటించింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో వున్నారని కోలీవుడ్, టాలీవుడ్ కోడై కూసింది. ఈ వార్తలపై స్పందించిన రష్మిక.. విజయ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని.. దానికి మించి ఏమీ లేదని బదులిచ్చింది. 
 
రష్మిక ప్రస్తుతం ''సరిలేరు నీకెవ్వరు'' చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు రష్మిక, కార్తి జోడీగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించేందుకు విజయ్‌ ఇటీవల పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అలాగే నితిన్ భీష్మలోనూ రష్మిక నటిస్తోంది. 
 
అంతేగాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాలో రష్మిక నటించబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది మార్చ్ వరకు అయిపోతుందని తెలుస్తుంది. ఈ సినిమా పూర్తయ్యాక కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాల శివ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. 
 
అందులో ముందుగా త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతున్నారు. ఇందులో రష్మిక ఎన్టీఆర్ సరసన నటించబోతోందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.