కశ్మీర్: ప్రధాని నోట్లో లడ్డు... కానీ కమల్ అలా కామెంట్ చేశారు....

Laddu
Last Modified మంగళవారం, 6 ఆగస్టు 2019 (19:30 IST)
ఆర్టికల్ 370 రద్దు చేసి జుమ్ము-కశ్మీర్‌ను పునర్విభజించడంపై దేశంలో చాలామటుకు సంబరాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నా ఆ పార్టీలోని కొందరు సభ్యులు జైహింద్ అంటూ తమ మద్దతును ఎన్డీఏకి తెలుపుతున్నారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాలు మోదీ సర్కారుకి పూర్తి మద్దతు తెలిపాయి.

తమిళనాడులో అన్నాడీఎంకే మోదీకి మద్దతు తెలిపితే... డీఎంకే మాత్రం వ్యతిరేకించింది. తాజాగా విశ్వ నటుడు కమల్ హాసన్ ఆర్టికల్ 370 రద్దుపై స్పందించారు. ఆయన దీని గురించి మాట్లాడుతూ... దీని పుట్టుకకు ఒక కారణముందని అన్నారు. అలాగే దీన్ని రద్దు చేయకుండా సవరణలు చేసి ఉంటే బాగుండేదన్నారు. మోదీ సర్కారు తీసుకున్న చర్య తిరోగమన, నిరంకుశమైనదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
kamal haasan
దీనిపై మరింత చదవండి :