మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (15:01 IST)

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లును టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లును నిరసిస్తూ మంగళవారం లోక్‌సభ నుంచి ఆ పార్టీ వాకౌట్ చేసింది. మంగళవారం లోక్‌‌సభలో కాశ్మీర్ విభజన బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై లోక్‌సభలో టీఎంసీ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ పాల్గొన్నారు. 
 
జమ్మూ కాశ్మీర్  విభజనను టీఎంసీ సభ్యుడు బందోపాధ్యాయ తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో ఉంటే ఈ బిల్లును సమ్మతించడమో, వ్యతిరేకించడమో చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు తనకు ఇష్టం లేదని బంధోపాద్యాయ ప్రకటించారు. ఈ బిల్లును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టుగా ఆయన లోక్‌సభలో ప్రకటించారు. 
 
తమ పార్టీ ఎంపీలతో కలిసి బందోపాధ్యాయ లోక్‌సభ నుండి వాకౌట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుపై పలు పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మనీష్ తివారీ ప్రకటించారు.