శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (16:27 IST)

17వ లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణం చేసిన కొత్త పెళ్లి కుమార్తెలు

లోక్‌సభ సభ్యులుగా టీఎంసీ తరపున ఎన్నికైన నుస్రత్ జహాన్, నటి మిమి చక్రవర్తిలు 17వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులంతా లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, కొత్త పెళ్లి కూతుళ్లు అయిన నుస్రత్, మిమి చక్రవర్తిలు మాత్రం వారం రోజలు తర్వాత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేశారు. సినీ నటి నుంచి రాజకీయనేతగా మహిళగా మారిన నుస్రత్... 17వ లోక్‌సభ ప్రారంభోత్సవ సమావేశాలకు హాజరుకాలేక పోయారు. 
 
దీనికి కారణం... ప్రముఖ పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహం చేసుకోవడమే. వీరి వివాహం ఈ నెల 17వ తేదీన టర్కిష్ పట్టణంలో జరిగింది. ఈ కారణంగా ఆమె ప్రారంభ సమావేశాలకు రాలేక పోయింది. ఇదే రోజున లోక్‌సభ సమావేశాలు ప్రారంభంకావడంతో ఆమె సభకు హాజరుకాలేదు. అలాగే, మరో నటి మిమి చక్రవర్తి కూడా 17వ లోక్‌సభ సమావేశాలకు హాజరుకాలేదు. కారణం.. నుస్రత్ జహన్‌తో పాటు ఈమె పెళ్లి కూడా జరిగింది. 
 
17వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుస్రత్, మిమిలు మాట్లాడుతూ, అనేక ప్రాధాన్య అంశాలపై సభలో ప్రస్తావించాల్సివుందన్నారు. ముఖ్యంగా తొలుత తమతమ నియోజకవర్గాల్లో సమస్యలపై తమ వాదన వినిపిస్తామని, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు.