ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకుండానే.. బాయ్‌ఫ్రెండ్‌తో #NusratJahan పెళ్లి
2019 సార్వత్రిక ఎన్నికల్లో మమత బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ తరపున బసీర్‌హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచి.. ఎంపీగా ప్రమాణం స్వీకారం చేయకముందే.. బెంగాలీ సినీ నటి నుస్రత్ జహాన్ పెళ్లి పీటలెక్కింది.
అంతేకాదు ఈ ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికైన అందగత్తె ఎంపీలలో ఆమె ఒకరు. ఈ భామతో పాటు పలువురు హీరోయిన్స్ కూడా 17వ లోక్‌సభకు ఎన్నికవడం విశేషం.
ఇక బెంగాలీ సినీ పరిశ్రమలో తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్.. ఇటీవల పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్‌గా దర్శనమిచ్చి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజాగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయ పద్దతిలో టర్కీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకుంది.
తన బాయ్ ఫ్రెండ్ ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ జైన్‌ను పెళ్లాడింది. టర్కీలో జరిగిన పెళ్లికి సంబంధించిన ఫోటోలను నుస్రత్ తన అభిమానులకు షేర్ చేసింది.