సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (10:37 IST)

మూడేళ్లు ప్రేమించాడు.. విడిపోదాం అన్నాడు.. అంతే యాసిడ్ పోసేసింది..

మహిళలపై అకృత్యాలు.. యాసిడ్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. బైకు వెనకనే కూర్చుని ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ పోసిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం బైక్ పై వెళుతున్న జంటపై యాసిడ్ దాడి జరుగగా, కేసును విచారించిన పోలీసులు, విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. 
 
ఈ దాడికి యువకుడి వెనుక కూర్చున్న యువతే కారణమని తేల్చారు. యువతీ యువకులు గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉండగా, గత కొంతకాలంగా తనను వివాహం చేసుకోవాలని ఆమె అడుగుతూ ఉండటంతో యువకుడు నిరాకరిస్తూ వచ్చాడు. మనిద్దరమూ విడిపోదామని చెప్పసాగాడు. దీంతో అతని మాటలకు తట్టుకోలేకపోయిన ఆమె అతనిపై యాసిడ్ పోయాలని నిర్ణయించుకుంది. 
 
ఈ క్రమంలో 11వ తేదీన ఇద్దరూ బైక్ పై బయటకు వెళ్లారు. ముఖం సరిగ్గా కనిపించట్లేదని హెల్మెట్ తీసేలా చేసింది. అంతే ఆ సమయంలో తనతో తెచ్చుకున్న తెచ్చుకున్న యాసిడ్ ను అతనిపై చల్లింది. ఈ ఘటనలో అతనికి మెడ, గొంతు, ముఖంపై గాయాలు కాగా, యువతికి స్వల్ప గాయాలు అయ్యాయి. 
 
స్థానికుల సమాచారంతో ఇద్దరినీ ఆసుపత్రికి చేర్చి కేసు విచారణ ప్రారంభించిన పోలీసులకు ఒక్క క్లూ కూడా లభించలేదు. చివరికి ప్రియురాలే ప్రియుడిపై దాడి చేసిందని.. పెళ్లికి నో చెప్పడంతోనే అతనిపై యాసిడ్ చల్లానని వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.