గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 15 జూన్ 2019 (14:52 IST)

కోర్కె తీర్చాలన్నాడు... కాదన్నందుకు పబ్ డాన్సర్‌ చీర లాగి కొరికాడు...

బతుకుదెరువు కోసం పబ్ డాన్సర్‌గా జీవనం చేస్తున్న పాపానికి, సదరు డాన్సర్‌ను నడిరోడ్డుపై అతి దారుణంగా అవమానించాడు ఓ కామాంధుడు. తన కోరిక తీర్చలేదని పబ్ ముందే ఆ యువతిపై బ్లేడ్లతో దాడిచేసి పళ్లతో రక్కాడు. ఒళ్లంతా గాయాలతో, ఘోరమైన అవమానంతో తల్లడిల్లుతుంటే నడిరోడ్డుపై చీర లాగి రాక్షసానందం కూడా పొందాడు. 
 
హైదరాబాద్ బేగంపేటలో ఈ దుస్సంఘటన జరిగింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... సినిమాలో అవకాశం కోసం ప్రయత్నాలు చేసి ఫలించక  బతుకుదెరువు కోసం పబ్ డ్యాన్సర్‌గా చేరింది. పబ్‌కు వచ్చే కొందరు పోకిరీలు తాగుబోతులు కోరిక తీర్చాలంటూ వేధించేవారు. అయినా వృత్తిలో ఇటువంటి వేధింపులు సహజమే అని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేదానిని తెలిపింది. 
 
మరోవైపు వ్యభిచారం చేయాలనీ, చేస్తే రోజుకి రూ. 10 వేలు వస్తాయని పబ్ నిర్వాహకులు తనపై ఒత్తిడి చేశారని ఆరోపిస్తోంది. పబ్‌లో తోటి డ్యాన్సర్‌ సిద్ధూ తన కోరిక తీర్చాలని వేధించాడని, తను ఒప్పుకోకపోవడంతో సిద్ధూ పబ్ ముందు దాడి చేయడంతో పాటు నడిరోడ్డుపై తన చీరను లాగి అవమానపరిచాడని కన్నీటిపర్యంతమైంది. తనకు న్యాయం చేయమని, సిద్ధూ, బార్ నిర్వాహకులపైనా పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు.