మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 5 జూన్ 2019 (16:06 IST)

పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి?

ప్రస్తుతం చాలామంది స్త్రీలు కొన్ని రకాల కారణాల వల్ల సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సంవత్సరం పాటు ఎలాంటి సంతాన నిరోధక పద్ధతులు అవలంభించకుండా శృంగారంలో పాల్గొన్నా సంతానం కలుగకపోతే దీన్ని సంతానలేమి సమస్యగా పరిగణించాల్సి వుంటుంది. అయితే, అనేకమంది మహిళల్లో ఈ సమస్యకు ముఖ్య కారణాలేంటి అనే విషయాన్ని చూద్దాం. 
 
ప్రతి నెలా సక్రమంగా (రెగ్యులర్‌) నెలసరి రాకపోవడం, పీసీఓడీ, గర్భకోశ వ్యాధులు, ఫైబ్రాయిడ్స్, అధిక బరువు, థైరాయిడ్ గ్రంథి లోపాలు, అకస్మాత్తుగా బరువు తగ్గడం, మానసిక ఒత్తిడి, ట్యూబల్ బ్లాకేజ్, సుఖవ్యాధులు మొదలైన వాటితో బాధపడుతున్నట్టయితే ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. 
 
వీటితో పాటు వారసత్వంగా... అంటే స్త్రీ కుటుంబంలో ఎవరైనా సంతానలేమి సమస్యలతో గానీ, థైరాయిడ్ గ్రంథి లోపాలతో గానీ బాధపడుతున్నా ఈ సమస్య అనేది ఏర్పడుతుందని వైద్యులు చెపుతున్నారు.
 
మానసిక ఒత్తిడి ఉండేటప్పుడు స్త్రీ శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు సరైన విధంగా ఉత్పత్తి కాకపోవడం సంతానలేమికి దారితీస్తుంది. గర్భనిరోధక మాత్రలు కూడా అండం విడుదలకు అవరోధంగా మారుతాయని చెపుతున్నారు.