లేడీ ఫ్యాన్స్‌తో రవిశాస్త్రి భలే ప్రాక్టీస్

ravishastri
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఈ పోటీల కోసం భారత జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై ఉంది. టీమిండియా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ను బుధవారం ఆడింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు.

అయితీ ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇద్దరు అమ్మాయిలతో కెమెరా కంటికి చిక్కారు. ఇంకేంముందు.. ఈ ఫోచో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఫోటోను చూసిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్, పాక్ క్రికెట్ అభిమాని అయిన డెన్నీస్ ఫ్రీడ్‌మ్యాన్ సెటైర్ వేశారు. "ప్రపంచకప్‌ కోసం ఇండియా చాలా అద్భుతంగా సిద్ధమవుతుందే.." అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

కాగా, గతంలో కూడా ఫ్రీడ్‌మ్యాన్ టీం ఇండియాపై, కెప్టెన్ విరాట్ కోహ్లీపై సెటైర్లు వేసి.. భారత అభిమానుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. పైగా, నెటిజన్లు కూడా ఈ ఫొటోపై సెటైర్లు వేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :