సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (17:24 IST)

సుచీలీక్స్.. ఐశ్వర్యా రాజేష్ లిప్ లాక్.. వైరల్ అవుతున్న ఘాటు ఫోటోలు

సుచీలీక్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి సుచీలీక్స్ వ్యవహారంలో తెలుగమ్మాయి, కనా సినిమా హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ చిక్కుకుంది. ఐశ్వర్యా రాజేష్‌కు సంబంధించిన లిప్ లాక్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఐశ్వర్యా ఫ్యాన్స్ షాకయ్యారు. 
 
గత కొన్నేళ్ల క్రితం ప్రముఖ గాయని సుచిత్ర సుచీలీక్స్ అనే పేరిట తమిళ సినీతారలకు సంబంధించిన రహస్య ఫోటోలను లీక్ చేస్తూ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌ను సుచీలీక్స్ షేక్ చేశాయి. 
 
అయితే సుచిత్ర తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని.. ఈ లీక్స్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేయడంతో ఈ వ్యవహారం ముగిసింది. కానీ తాజాగా మళ్లీ సుచీలీక్స్ కోలీవుడ్ తారలకు చెమటలు పట్టిస్తున్నాయి. సుచీలీక్స్ పేరిట గల ట్విట్టర్ అకౌంట్‌లో ఐశ్వర్యా రాజేశ్ లిప్ లాక్, ఘాటు రొమాన్స్ సన్నివేశాలతో కూడిన ఫోటోలు లీక్ అయ్యాయి. 
 
ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలు ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్న తాజా సినిమాకు చెందినదై వుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఐశ్వర్యా రాజేశ్ ఇప్పటివరకు ఘాటు గ్లామర్‌కు దూరంగా వుంటోంది. అలాంటి ఐశ్వర్యా లిప్ లాక్, అందాల ఆరబోత సన్నివేశాల్లో కనిపిస్తుందంటే ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. 
 
కానీ ఆరా తీస్తే ఐశ్వర్యా రాజేష్ తాజా చిత్రం ''బోదై కాదల్'' అనే ఆల్బమ్ సాంగ్‌లోనివని తెలుస్తోంది. ఈ పాటను గౌతమ్ వాసుదేవ మేనన్ డైరక్షన్‌లో కార్తీక్ సంగీతం సమకూర్చారు.