AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రేదశ్ లో సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసే కమిటీకి స్వాగతిస్తున్నామని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభట్ల ట్విట్టర్ లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా నిర్మాతలు తమ సినిమాల విడుదలకుముందు ప్రభుత్వాలను చుట్టూ తిరిగి అభ్యర్తించడం జరుగుతుండేది. ఇది ద్రుష్టిలో పెట్టుకుని కొందరు ఎగ్జిబిటర్లరు హైకోర్టులో రిల్ పిటీష్ వేయగా దానిమీద పూర్లి క్లారిటీ ఇచ్చింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ జీ.వో.ను నేడు విడుదల చేసింది. దానివల్ల సినిమా టెకెట్ల రేటు పెంచుకోవడానికి ఓ కమిటీ వేశారు.
ఇలా నియమించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది ప్రేక్షకుల యాక్సెస్, ప్రదర్శకుల స్థిరత్వం, నిర్మాత ఆసక్తులను అర్థం చేసుకోవడంలో కీలకమైన దశ. సమతుల్య, నిర్మాణాత్మక అంతర్దృష్టుల కోసం ఎదురు చూస్తున్నాను అని వివేక్ కూచిభొట్ల తెలియజేస్తున్నారు.
కొంతకాలం ఎ.పి.లో సినిమా టికెట్ల రేట్లు తగ్గించినప్పుడు చిన్న నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నట్టికుమార్ ఆద్వర్యంలో కొందరు దీనిపై చాలాకాలం ప్రభుత్వానికి విన్నివించి సక్సెస్ అయ్యారు. దానివల్ల థియేటర్లకు ప్రేక్షకుడు రావడం జరిగింది. కానీ రానురాను థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. పెద్ద సినిమాలకు రేట్లు పెంచడంపై కొందరు వ్యతిరేకంగా వున్నారు. ప్రేక్షకులు అందులో ముఖ్యంగా కనిపిస్తారు. కొందరైతే ఎలాగో ఓటీటీలోకి వచ్చేస్తుందనే ధీమాతో థియేటర్లకు రావడం మానేశారు.
అయితే ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో కమిటీ చిత్రప్రముఖులతో చర్చించి తీసుకునే నిర్ణయంపై ఆదారపడివుంది. దానితో బెంగులూళరు తరహాలో శ్లాబ్ సిస్టమ్ పెడతారేమోనని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. ఫైనల్ గా టికెట్ల రేట్ల పెంపుదలతో ప్రబుత్వానికి ఆదాయం వస్తుంది. నిర్మాత, ఎగ్జిబిటర్లకు పర్సంటెజీ వస్తుంది. ప్రేక్షకులకే భారం అవుతుందనే మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా కమిటీ ఫైనల్ నిర్ణయం వరకు ఏ విధంగా తీర్పు వస్తుందో చూడాలి.