సంబంధిత వార్తలు
కంటెంట్ బేస్డ్ భారీ ప్రాజెక్టులతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దూకుడు
TG Vishwa Prasad
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మరో అద్భుతమైన చిత్రం రాజా సాబ్ రాబోతోంది. దర్శకుడు మారుతి ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు.ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ అద్భుతమైన కొత్త లుక్‌లో కనిపించారు. గ్లింప్స్‌కి పాజిటివ్ రియాక్షన్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
టీజీ విశ్వ ప్రసాద్ ప్రస్తుతం తన ప్రొడక్షన్ కంపెనీ లైనప్‌ను ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. తేజ సజ్జతో మిరాయ్, అడివి శేష్‌తో G2 వంటి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆకర్షణీయమైన కథనాలను రూపొందించడంలో, విభిన్న కథాకథనాలను అన్వేషించడంలో నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది.
అంతేకాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవలె సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనిల డైనమిక్ కాంబినేషన్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. స్టార్ హీరోలు, స్టార్ క్యాస్టింగ్‌తో అద్భుతమైన కంటెంట్-సెంట్రిక్ మూవీస్‌లను నిర్మిస్తోంది.
