సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (15:22 IST)

మిస్టర్ బచ్చన్ నుంచి రెప్పల్ డప్పుల్‌ సాంగ్ కు అనూహ్యస్పందన

Ravi Teja, Bhagyashree
Ravi Teja, Bhagyashree
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' మ్యూజిక్ ప్రమోషన్లు ఫస్ట్  సింగిల్ సితార్‌కు అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్‌ను విడుదల చేశారు, ఇది ఫస్ట్ సింగిల్‌కి చాలా డిఫరెంట్ గా వుంది.
 
రెప్పల్ డప్పుల్ హైలీ ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన కంప్లీట్ మాస్ నంబర్. మ్యూజిక్ కంపోజిషన్, ట్యూన్ లో ఈ మాస్ నంబర్‌ను మ్యాసీ బ్లాక్‌బస్టర్‌గా మార్చేలా కంపోజ్ చేశారు మిక్కీ జె మేయర్.  ఆర్కెస్ట్రేషన్ అద్భుతంగా వుంది. సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ తమ స్పెషల్ వోలక్స్ తో ఎక్స్ ట్రార్డినరీ గా పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఈ ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ నంబర్ బీట్‌లను పెర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాయి. ఇది ప్రతి మాస్ పార్టీ ప్లేలిస్ట్‌లో ఉండబోతోంది.
 
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ ఫ్లోర్‌ ని ఆదరగొట్టారు. ఇన్ఫెక్షియస్ ఎనర్జీ తో, వైబ్రెంట్ స్పేస్ లో సెట్ చేయబడిన డ్యాన్స్ నంబర్ డైనమిక్ బీట్‌లతో అదిరిపోయింది. రవితేజ స్మార్ట్ గా కనిపించగా, భాగ్యశ్రీ బోర్సే తన మాస్ స్టెప్పులు, గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ మాస్ బ్లాక్ బస్టర్ కు భాను మాస్టర్ అమెజింగా కొరియోగ్రఫీ చేశారు.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా, ప్రొడక్షన్ డిజైన్ బ్రహ్మ కడలి. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.
మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న విడుదల కానుంది.
 
 తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్