బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 11 జులై 2024 (15:47 IST)

మిస్టర్ బచ్చన్ లోని పాటను జిమ్మిక్ చేస్తున్న హరీశ్ శంకర్

Ravi Teja Bhagyashree Borse
Ravi Teja Bhagyashree Borse
డైరెక్టర్ హరీష్ శంకర్ కు మ్యూజిక్ లో మంచి టేస్ట్ వుంది, అందుకే రవితేజ నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' కూడా డిఫరెంట్ గా ట్రీట్ చేస్తున్నాడు. నిన్ననే విడుదలైన సితార్ సాంగ్ లో భాగ్యశ్రీ బోర్సే తో కలిసి స్టెప్ లేసిన రవితేజ ఆమె డ్రెస్ లోని జేబులో చెయ్యిపెట్టి సాంగ్ చేసిన విధానం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది.
 
Ravi Teja Bhagyashree Borse
Ravi Teja Bhagyashree Borse
జేబులో చేతులు పెట్టుకుని స్టయిల్ లో వేసే స్టెప్ లు కంపోజ్ చేశాడు శేఖర్ మాస్టర్. ఈ పాటను దర్శకుడు హరీష్ శంకర్ తన స్టయిల్ ను జోడించి హీరోయిన్ డ్రెస్ లో కూడా జేబులు పెట్టించి అందులో రవితేజ చేతులు వేసి స్టయిల్ గా పట్టుకోవడం లాంటి జిమ్మిక్ చేశాడు. 
 
చిట్టి పొట్టి గువ్వలాంటి చక్కనమ్మ.. బొట్టు పెట్టి చీర కట్టుకోమ్మా...అంటూ  సాగే పాటలో రవితేజ హీరోయిన్ ను గట్టిగా హగ్ చేసుకోవడం వంటి షాట్స్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పెట్టి యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
దీనికి బాలీవుడ్ లో కొల్లి అనే క్రిటిక్ సోషల్ మీడియాలో ఆ తరహా స్టిల్స్ పెట్టి హీరోయిన్ తో కలిసి ఇలాకూడా డాన్స్ చేయవచ్చా? అంటూ కామెంట్ చేస్తూ ప్రమోషన్ చేస్తున్నాడు. ఇటీవలే తెలుగు మీడియాకంటే బాలీవుడ్ మీడియాలో సరికొత్తగా పబ్లిసిటీ ఇస్తూ తెలుగు సినిమాను హైలైట్ చేయడం మామూలైపోయిందని తెలుస్తోంది.