సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (17:31 IST)

శ్రియా చరణ్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లు.. ఆ ఫోటోకు ఫ్లైయింగ్ కిస్సా?

దశాబ్దం పాటు సినిమాల్లో కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీగా అందాలను ఆరబోస్తున్న శ్రేయా చరణ్ తాజాగా ఓ సెన్సేషనల్ బొమ్మను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే విమర్శలకు తావిచ్చింది. 
 
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం తగ్గని శ్రియా చరణ్.. అవకాశాలను అందిపుచ్చుకోవడానికే ఇంత పని చేస్తుందని సమాచారం. తమిళంలో "నరకాసురన్'' అనే చిత్రంలో నటిస్తోంది శ్రేయా. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం అరవింద్ స్వామితో ఇందులో రొమాన్స్ చేయనుంది. 
 
ఈ నేపథ్యంలో పెళ్లికి తర్వాత దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే.. తన భర్తతో హ్యాపీగా ట్రిప్పులేస్తున్న ఆమె.. నగ్నంగా వున్న ఓ పెయింటింగ్‌కు ముందు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ నిలబడింది. ఈ ఫోటోను చూసినవారంతా శ్రియా చరణ్‌ను తిట్టిపోస్తున్నారు. 
 
ఇంతకుముందు ఓ గ్లామర్ వీడియోను అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది. విదేశాల్లో తన భర్తతో కలిసి ఓ చీకటి గుహలోకి వెళ్లిన శ్రేయా.. గ్లామర్ దుస్తులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.