సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (11:31 IST)

జయసుధకు కీలక పదవి.. జగన్ పరిశీలన.. పోసాని, అలీకి ఏమిస్తారో?

సీనియర్‌ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధను కీలక పదవి వరించనుందని టాక్ వస్తోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ పదవికి ఆమెను ఎంపిక చేసే దిశగా రంగం సిద్ధమవుతుంది.


ఇందులో భాగంగా టీడీపీ హయాంలో ఈ పదవిలో నియమితుడైన అంబికాకృష్ణ ఇటీవల చైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో జయసుధను కూర్చోబెట్టేందుకు కొత్త సర్కారు రెడీ అవుతోంది. 
 
ఎన్నికల సమయంలో ఖాళీ అయిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ గిరీ ఎవరికి దక్కుతుందా? అన్న టాక్‌ నడుస్తోంది. ఇందుకోసం జయసుధ పేరును జగన్‌ పరిశీలిస్తున్నారని సమాచారం.

సీనియర్‌ నటి కావడంతోపాటు పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశమని జగన్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. 
 
ఇకపోతే.. వైకాపా తరపున పృధ్వీరాజ్‌, అలీ, పోసాని, మోహన్‌బాబు, జయసుధ, జీవిత, రాజశేఖర్‌ తదితర ప్రముఖలు ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి రావడంతో తమకు ఏదైనా కీలక పదవి దక్కుతుందన్న ఆశతో వున్నారు. మరి వీరికి ఎలాంటి పదవులు లభిస్తాయో వేచి చూడాలి మరి.