శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (14:38 IST)

ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అయ్యేవాళ్లను చూశా : రాధా ప్రశాంతి

తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని సినీ నటి రాధా ప్రశాంతి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చేవారు కాంప్రమైజ్ అయితేనే ఛాన్సులు వస్తున్నాయని, ఇలా కాంప్రమైజ్ అయ్యేవాళ్లను తాను చాలా మందిని చూశానని ఆమె చెప్పుకొచ్చారు.
 
ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కొన్నిటికి కాంప్రమైజ్ అయితే అవకాశం ఇవ్వడం .. లేదంటే తీసేయడం చూశాను. మణిరత్నం, బాలచందర్, బాలుమహేంద్ర, కె. విశ్వనాథ్ వంటి దర్శకులు పాత్రకి తగిన నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అవసరమనుకుంటే కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని ఆమె వాపోయింది. 
 
కాంప్రమైజ్ అయితేనే అవకాశాలు వస్తాయన్నారు. లేదంటే పక్క రాష్ట్రాల వారిని తీసుకుంటారని చెప్పారు. మరి ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన వాళ్లు ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా, అక్క, చెల్లి, వదిన, అమ్మ వంటి పాత్రలు చేయడానికి ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు వున్నారు. అయినా ఆ పాత్రలకి వేరే రాష్ట్రాల వారిని తీసుకుంటున్నారు. ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన తెలుగు వాళ్లు ఏమైపోవాలనేది దర్శక నిర్మాతలుగానీ .. కొంతమంది హీరోలుగాని  ఆలోచించడం లేదు. బిజినెస్ పేరుతో ఇక్కడి వాళ్లను పక్కన పెట్టేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. 

కాగా, తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని బహిర్గతం చేసిన నటి శ్రీరెడ్డి. ఈ అంశంపై ఆమె బాగానే పోరాటం చేసింది. చివరకు సినీ ఇండస్ట్రీని వీడి ఇపుడు చెన్నైలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.