మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (07:20 IST)

మెగా డాటర్‌తో ప్రేమాయణం లేదు : నాగశౌర్య

మెగా డాటర్ నిహారికితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వచ్చిన వార్తలపై యువ హీరో నాగశౌర్య కొట్టిపారేశారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పారు. ఆమెతో కలిసి ఓ చిత్రంలో మాత్రమే నటించానని, అంతేగానీ, ప్రేమలేదని కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 
 
నాగశౌర్య - నీహారిక కలిసి ఒక మనసు చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ముఖ్యంగా, నిహారిక ఇటీవల ఓ చిన్నారిని ఎత్తుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, దానిపై నాగశౌర్య కామెంట్ చేశాడు. అప్పటినుంచి మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ అంటూ ఊహాగానాలు బయల్దేరాయి. వీటిపై నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో, తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారంలేదని ఈ యువ హీరో స్పష్టంగా చెప్పాడు. నిహారికతోనే కాదు, తనకు ఎవరితోనూ లవ్ అఫైర్ లేదని స్పష్టం చేశాడు. 
 
తాను, నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఖరికి, ఫ్రెండ్స్ కూడా "మీ లవ్ స్టోరీ చెప్పు" అంటూ ఫోన్లు చేస్తున్నారని నాగశౌర్య తెలిపాడు. ఈ తరహా ప్రచారం ఎంతవరకు వెళుతుందో అర్థంకావడంలేదని ఆందోళన వ్యక్తం చేశాడు.