గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (12:57 IST)

మేకప్ బాహ్య అందాన్ని చూపిస్తుంది... : కాజల్ అగర్వాల్

చిత్ర పరిశ్రమ అంటేనే ఓ గ్లామర్ ఫీల్డ్. ఆ రంగంలో ఉండేవారు ఎల్లవేళలా ముఖానికి రుంగు వేసుకుని ఉండాల్సిందే. పైగా, మేకప్‌తో ఉంటేనే వారి అందం మరింతగా ద్విగుణీకృతమైవుంటుంది. అందుకే అభిమానులు వారిని అమితంగా ఇష్టపడతారు.
 
ఈ కారణంగానే సెలెబ్రిటీలు బయటికి వచ్చినప్పుడు కొద్దోగొప్పో మేకప్ వేసుకొని వస్తుంటారు. అయితే తెలుగు చందమాన కాజల్ అగర్వాల్ తొలిసారి మేకప్ లేని ముఖాన్ని సినీ ప్రపంచానికి చూపించింది. మేకప్ లేకుండా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు ఆ ఫొటోలకు ఓ మెసేజ్ పెట్టి అందరిలో స్ఫూర్తిని నింపుతోంది.
 
అందులో... "ఎవ్వరైనా తమలోని తామును చూసుకోలేరు. ఎందుకంటే బయటి అందానికే ఈ ప్రపంచం ఆస్వాదిస్తుంటుంది. లేకపోతే సోషల్ మీడియా కూడా మనం అందంగా తయారుకావాలని సూచిస్తుంటుంది. ఒకరోజు నువ్వు అందంగా కనిపించేందుకు ఎన్నో వేల రూపాలయలను వినియోగిస్తుంటాం. ఎక్కడైనా శరీరాకర్షణనే చూస్తుంటారు. మనచుట్టూ జనాలు ఉండాలని మనం అనుకుంటుంటాం. వారు వదిలి వెళ్తే బాధపడుతుంటాం. కానీ నిజమైన సంతోషం అన్నది నిన్ను నువ్వు స్వీకరించినప్పుడు కలుగుతుంది. మేకప్ అన్నది మన బయటి అందాన్ని మాత్రమే చూపిస్తుంది. కానీ మన వ్యక్తిత్వాన్ని మార్చదు కదా..? నిజమైన అందమంటే మనల్ని మనం ఇష్టపడటమే" అంటూ కాజల్ వ్యాఖ్యానించింది. కాగా ఈ ఫొటోలపై ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.