శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 22 మే 2019 (20:21 IST)

'సీత'పై తేజ కామెంట్స్ దెబ్బకు షాకైన కాజల్, బెల్లంకొండ సాయి, అనిల్?

ద‌ర్శ‌కుడు తేజ తెర‌కెక్కించిన తాజా చిత్రం సీత‌. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించారు. ఈ విభిన్న క‌థా చిత్రం ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్ట‌ర్ తేజ స్పందిస్తూ.. సీత సినిమా సూప‌రా..? బాగుందా..? యావ‌రేజా..? నాకు తెలియ‌దు. 
 
సినిమా చూసిన త‌ర్వాత ఆడియ‌న్సే చెప్పాలి. సినిమా తీసిన త‌ర్వాత ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు గారికి ఫోన్ చేసాను. సార్.. సినిమా తీసాను చూసి అందులో ఉన్న త‌ప్పులు ఏంటో చెప్పి న‌న్ను తిట్టండి అని చెప్పాను. 
 
ఆడియ‌న్స్ తిట్ట‌డం కంటే ముందు మీరు తిడితే క‌రెక్ష‌న్స్ చేసుకుంటాను అన్నాను. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఈ సినిమా చూసి ఇందులో ఉన్న త‌ప్పులు ఏంటో చెప్పారు. ఆ త‌ర్వాత వాళ్లు చెప్పిన ప్ర‌కారం మ‌ళ్లీ కొన్ని మార్పులు చేసాను. నేనేమీ ఇంటిలిజెంట్ కాదు. 
 
క‌ళ్ల‌జోడు పెట్టుకోవ‌డం వల‌న అలా క‌నిపిస్తున్నానేమో కానీ.. నాది యావ‌రేజ్ బ్రైయిన్. క‌ళ్ల‌జోడు పెట్టుకున్న వాళ్లంద‌రూ మేధావులు కాదు. కొంతమందే ఉంటారు. 
 
ఇలా తేజ మాట్లాడేస‌రికి ప‌క్క‌నే ఉన్న నిర్మాత అనిల్ సుంక‌ర‌.. తేజ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని షాక్ అయి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొన్నాడు. త‌ను తెర‌కెక్కించిన సినిమా గురించి ద‌ర్శ‌కుడే ఎలా ఉందో తెలియ‌దు. త‌ప్పులు ఉన్నాయి క‌రెక్ట్ చేసుకున్నాను.. ఇలా మాట్లాడితే.. ఇక ఆడియ‌న్‌కి సినిమా చూడాల‌ని ఎందుకు అనిపిస్తుంది. నిర్మాత అనిల్ సుంక‌రే కాకుండా అక్క‌డున్న వారంద‌రూ తేజ మాట‌ల‌కి షాక్ అయ్యార‌ట‌. అది..మ్యాట‌రు..!