శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 20 మే 2019 (20:12 IST)

ఆ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాను: కాజల్

వరుస హిట్లతో సినిమాల్లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్‌కు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో మంచి పేరే ఉంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో కాజల్‌కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. ఒక చిన్న సినిమా కళ్యాణ్ రామ్‌తో కలిసి నటించిన కాజల్ ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలనే సాధించింది. యువ నటులతో కాదు సీనియర్ నటులతో నటించి తానేంటో నిరూపించుకుంది.
 
అయితే కొన్ని విషయాల్లో మాత్రం తాను ఏమాత్రం కాంప్రమైజ్ కానంటోంది కాజల్. నాకంటూ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఎవరో చెబితే నేను దేనికి కాంప్రమైజ్ కాను. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. నాకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు నాకు తెలుసు. వేరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. నా డ్రస్సింగ్, నేను ఎలాంటి వారితో ఉండాలో కూడా నాకు బాగా తెలుస్తుంది. నేను చిన్న పిల్లను కాను. నేను ఎక్కడా, ఏ విషయంలను కాంప్రమైజ్ కాను. 
 
సీత విషయంలోను అంతే. మా నాన్న, అమ్మ సీత సినిమాలో నువ్వు నటించడం అవసరమా అని ప్రశ్నించారు. కానీ నేను ఏ సినిమాలో నటించాలో నాకు బాగా తెలుసు. నాకు సలహాలు చెప్పేవారు స్నేహితులే కాదు.. తల్లిదండ్రులైనా కాంప్రమైజ్ కానంటోంది కాజల్.