శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 13 జూన్ 2019 (13:15 IST)

టీనేజ్ అమ్మాయితో విశాల్.. అలాంటి ఫోటోను పోస్ట్ చేసింది ఎవరు..?

టీనేజ్ అమ్మాయితో పందెం కోడి హీరో విశాల్ సన్నిహితంగా వున్నట్లు గల ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే పాఠశాల విద్యార్థినితో విశాల్ క్లోజ్‌గా వున్న ఫోటోను ట్రెండ్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. గత కొన్ని నెలల క్రితం పొరుగింటి మహిళతో ఏర్పడిన వివాదం కారణంగా ఆమె కుమార్తె (స్కూల్ స్టూడెంట్)ను అశ్లీలంగా నటుడు విశాల్‌తో కలిపి ఫోటోను మార్ఫింగ్ చేసింది.. దర్షిని అనే మహిళ. 
 
ఈ ఫోటో వ్యవహారం స్కూల్ స్టూడెంట్ తల్లిదండ్రులకు తెలియరావడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ సెల్ ద్వారా ఈ ఫోటోను ఎవరు పోస్టు చేశారనే వివరాలను కూపీ లాగారు. 
 
ఈ క్రమంలో పక్కింటి మహిళతో ఏర్పడిన గొడవ కారణంగా ఆమె కుమార్తెను ఇలా.. విశాల్‌తో కలిపే అశ్లీల ఫోటోను దర్శిని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. ఆపై 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కింద, ఆమెను చెన్నై పుళల్ జైలుకు తరలించారు.