'ఇదే నా ఆఖరి టిక్‌టాక్‌ వీడియో' అంటూ విషం తాగి.. భర్తకు పంపింది..

శ్రీ| Last Updated: గురువారం, 13 జూన్ 2019 (10:56 IST)
టిక్‌టాక్‌' మరొకరి ప్రాణాలను తీసింది. టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్న భార్యను మందలించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయడం సంచలనంగా మారింది. 
 
తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అరియలూరు జిల్లా సెందురైలోని వంగారం గ్రామానికి చెందిన అనిత(24)తో పళనివేలుకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి ఇద్దరు పిల్లలు. పళనివేలు సింగపూర్‌లో పనిచేస్తుండగా ఇద్దరు పిల్లలతో పెరంబలూరులో ఉంటోంది. అనిత.. టిక్‌టాక్‌కు బానిసగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో వీడియోలను అప్‌లోడ్‌ చేసేది. 
 
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పిల్లలకు దెబ్బ తగిలి గాయపడ్డారు. అప్పుడు కూడా అనిత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బంధువుల ద్వారా ఆ విషయం పళనివేలుకు తెలిసింది. పిల్లలకు దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేయడమేంటంటూ ఫోన్‌ చేసి మందలించాడు. 
 
మనస్తాపం చెందిన అనిత 'ఇదే నా ఆఖరి టిక్‌టాక్‌ వీడియో' అని పేర్కొంటూ వీడియో తీస్తూ పురుగుల మందు తాగేసింది. ఆ వీడియోను అప్‌లోడ్‌ అయిన కొద్దిసేపటికే ఆమె మరణించింది.దీనిపై మరింత చదవండి :