శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 12 జూన్ 2019 (12:56 IST)

స్టూడెంట్‌కు కామ పాఠాలు... నగ్న వీడియోలు చూపించింది.. చివరకు?

చదువు చెప్పాల్సిన పంతులమ్మే... కామ కోరికలు తీర్చమని స్టూడెంట్ వెంట పడిన ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని హైస్కూల్‌లో టీచర్ గా పనిచేస్తున్న కిల్సీ రోచెల్ అదే స్కూల్ లోని 16 సంవత్సరాల యువకుడిపై కన్నేసింది. ఎలాగైన అతడిని లోబరుచుకోవాలని ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. ఇది గమనించిన ఈ విద్యార్థి కిల్సీ రోచెల్‌కు దూరంగా ఉండటం ప్రారంభించాడు. అయితే అతడిని రెచ్చగొడితే దారిలోకి వస్తాడని భావించిన కిల్సీ, అతడికి సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకరమైన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించింది. 
 
అయితే ఆ యువకుడు టీచర్ చేసిన పనితో ఏం చేయాలో పాలుపోలేదు. ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలని భావించిన ఆ యువకుడు టీచర్ కిల్సీపై పాఠశాల మేనేజ్మెంట్‌కు ఫిర్యాదు చేశాడు. కిల్సీ పంపిన వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్ మెసేజీలను స్కూల్ మేనేజ్మెంట్‌కు చూపించాడు. వాటిలో అధికంగా కిల్సీ నగ్న వీడియోలతో పాటు, ఫోటోలు, బూతు మెసేజీలు ఉన్నాయి. దీంతో పాఠశాల మేనేజ్మెంట్ దిమ్మతిరిగిపోయింది. 
 
విద్యార్థి తల్లిదండ్రులకు సైతం ఈ విషయం తెలిపారు. పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న స్కూలు యాజమాన్యం కిల్సీపై చర్యలకు దిగింది. పోలీసులకు కిల్సీపై ఫిర్యాదు చేయడంతో వారు ఆమెను అరెస్టు చేశారు. మైనర్ బాలుడిని వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో కిల్సీని కోర్టులో ప్రవేశపెట్టగా, ఆమెకు 15000 డాలర్ల జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు.