ముస్లిం మహిళా ఎంపీ కాళ్ళకు మెట్టెలు - నుదుట బొట్టు పెట్టుకుందనీ...
నుస్రత్ జహాన్. ఈమె వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి లోక్‌సభకు తృణమూల్ ఎంపీగా ఎంపికైంది. పైగా, కొత్తగా పెళ్లి చేసుకుంది. అదీ కూడా ఓ హిందూ వరుడ్ని. దీంతో ఆమె కాలికి మెట్టెలు, నుదట బొట్టు, మెడలో మంగళసూత్రం ధరించింది. ఈమెల 25వ తేదీన ఆమె లోక్‌సభలో అడుగుపెట్టారు.
ఇదే ఇప్పుడామెను చిక్కుల్లోపడేసింది. ఇస్లాంకు, షరియత్‌కు విరుద్ధమైన పద్ధతులను ఆమె ఆచరిస్తున్నారంటూ ఓ ముస్లిం పెద్ద నుస్రత్ జహాన్‌పై ఫత్వాను జారీ చేశారు. బెంగాలీ నటి కూడా అయిన నుస్రత్.. బసిర్హాత్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఇటీవలే హిందూ వ్యాపారి నిఖిల్ జైన్‌ను అమె పెళ్లాడారు. భర్త తరపువారి మతాచారాలనే ఆమె పాటించాలని నిర్ణయించుకుంది.
దీన్ని ముఫ్తీ అసద్ వాస్మీ అనే మతపెద్ద తీవ్రంగా తప్పుబట్టారు. బొట్టు, మంగళసూత్రం, మట్టెలతో సభకు ఆమె హాజరవడంపై ముఫ్తీ మండిపడ్డారు. షరియత్‌ను నుస్రత్ ఉల్లంఘించారంటూ ఆమెపై ఆయన ఫత్వా జారీ చేశారు.
అయితే.. నుస్రత్‌కు బీజేపీ నేత సాధ్వి ప్రాచి మద్దతు పలికారు. హిందూ అమ్మాయిలను అదే ముస్లిం యువకులు లవ్ జిహాద్ పేరిట వలలో వేసుకుని బుర్ఖా ధరించాలని ఒత్తిడి చేస్తే ధర్మ విరుద్ధం కాదు కానీ.. ఒక ముస్లిం మహిళ.. హిందువును పెళ్లాడి మంగళసూత్రం, నుదుటన బొట్టు పెట్టుకుంటే ముస్లిం మతపెద్దలకు ధర్మవిరుద్ధంగా కనిపిస్తుందా? అని నిలదీశారు.