ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూసి వైసీపీ నాయకుల కంటే ఎక్కువుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే... వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించడం... చంద్రబాబు అడ్డుకోవడం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వరుసగా ట్వీట్స్ పెడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌లో వర్మ స్పందిస్తూ... ఎట్టకేలకు అతని నిజాన్ని చెప్పబోతున్నా. మే 31న నా ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నా అని...