సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 21 మే 2019 (13:41 IST)

నాన్నను మిస్ అయ్యా : రాహుల్ గాంధీ కన్నీళ్లు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28వ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాజీవ్ స్మారకమున్న వీర్‌భూమి వద్ద యూపీఏ ఛైర్ పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా  రాహుల్ గాంధీ ట్విట్టర్‌ ద్వారా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగిన వ్యక్తి మా నాన్న రాజీవ్ గాంధీ అని, ప్రతి ఒక్కరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం నాన్నదగ్గరే నేర్చుకున్నాను. నాన్నను మిస్‌ అయ్యా' అని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఈ సంధర్భంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు.