గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 23 మే 2019 (13:37 IST)

టీడీపీ 'చచ్చిపోయింది' అంటున్న రామ్‌గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పరిస్థితిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ వరుస ట్వీట్‌లు చేశారు.


చంద్రబాబు చేసిన పాపాలు చుట్టుకుని సైకిల్ టైర్ పంక్చర్ అయిందని వర్మ సెటైరిక్ మీమ్ చేశాడు. టీడీపీ పార్టీ 1982, మార్చి 29న పుట్టిందని, అయితే మరణించిన తేదీ మాత్రం 2019, మే 23 అని వ్యాఖ్యానించారు. 
 
టీడీపీ చావుకు.. అబద్దాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, నారా లోకేష్‌, వైఎస్‌ జగన్‌ చరిష్మా కారణమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు తన మామ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చేసిన మోసం గుర్తుకు వస్తుందని తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు అడ్డంకులు సృష్టించారనే వాదనను మనస్సులో పెట్టుకుని వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు.