గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (12:37 IST)

కుప్పంలో చంద్రబాబు.. మంగళగిరిలో నారాలోకేష్ వెనుకంజ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం వైకాపా 152 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. టీడీపీ 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ వెనుకంజలో ఉన్నారు.


మంగళగిరిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ పై 7400 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చిలకలూరి పేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ అభ్యర్థి రజనీ 928 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
 
అలాగే కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబుకు తిరుగులేదు. కానీ, ఈసారి పరిస్థితి తలకిందులయ్యేలా కనిపిస్తోంది. కౌంటింగ్‌ రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన వెనుకంజలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి 357 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక 110 స్థానాల్లో వైసీపీ లీడింగ్‌లోకి వచ్చింది. టీడీపీ 25 సీట్లలో ముందంజలో ఉంది.