1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Reservation in Outsourcing Jobs at AP

ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో రిజర్వేషన్

Reservation
ఏపీ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ అమలుకు ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ర్రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలనీ.. రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర స్థాయిలో ఓ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట.

డిసెంబర్ 1న కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు కానుండగా వచ్చే క్యాబినెట్ ఆమోదం పొందే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలోని అర్చకుల సమస్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ఓ సబ్ కమిటీని నియమించనున్నట్లుగా తెలుస్తుంది.

ఇందులో ముఖ్యంగా విరమణ లేకుండా అర్చకత్వం, ఇదే అంశంపై సుప్రీమ్ కోర్టు తీర్పుపై పరిశీలన, కనీసం ఆదాయంలేని అర్చకులకు ఐదువేల అందుతున్న గౌరవ వేతనాన్ని పదివేలకు పెంపు, ప్రస్తుతం అర్చకులకు ఇస్తున్న పది వేలు 16500 కి పెంపు, 3600 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకంపై సబ్ కమిటీ నివేదికను ఇవ్వనున్నారట.
తర్వాతి కథనం
మహబూబ్ నగర్ వద్ద పట్టాలు తప్పిన రైలింజన్