శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (09:18 IST)

మహబూబ్ నగర్ వద్ద పట్టాలు తప్పిన రైలింజన్

మహబూబ్ నగర్ మన్యంకొండ సమీపంలో ట్రాక్ మిషన్ రైల్ ఇంజన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్లో సిగ్నల్ కోసం పలు రైళ్లు ఎదురు చూస్తుండగా నాలుగు గంటలుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
 
పలు రైళ్ల పాక్షిక రద్దు...
మహబూబ్ నగర్ మన్యంకొండ సమీపంలో ట్రాక్ మిషన్ రైల్ ఇంజన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు హైదరాబాద్ నుండి మరో ఇంజన్ తెప్పిస్తున్నారు.

మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్లో సిగ్నల్ కోసం పలు రైళ్లు ఐదు గంటలుగా ఎదురు చూస్తుండగా ఎదురు చూస్తుండగా ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు.

కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్, సికింద్రాబాద్-కర్నూలు సిటీ ఎక్స్ ప్రెస్ మహబూబ్ నగర్ వరకే పరిమితం కాగా కాచిగూడ-కర్నూలు సిటీ రైలు ఉందానగర్ వరకు, కర్నూల్ సిటీ- సికింద్రాబాద్ తుంగభద్రా ఎక్స్ ప్రెస్ దేవరకొండ వరకు, రాయచూర్-గద్వాల ఎక్స్ ప్రెస్ గద్వాల వరకు, గుంటూరు-కాచిగూడ ఎక్స్ ప్రెస్ కౌకుంట్ల వరకు, కాచిగూడ-చెంగల్ పట్టు, కాచిగూడ-నాగర్ కోయల్, కాచిగూడ-చిత్తూరు, కాచిగూడ-మైసూరు, ఓఖా-రామేశ్వరం రైళ్లను రాయచూర్-గుత్తి మీదుగా మళ్లించారు.