బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (08:59 IST)

ఈఎస్ఐ స్కామ్ ఎలా జరిగింది?..సీబీఐ ప్రశ్నల వర్షం

ఈఎస్ఐ స్కామ్ కేసులో డైరెక్టర్ దేవికారానితో పాటు మరో ఆరుగురు నిందితులను రెండు రోజుల పాటు ఏసీబీ కోర్ట్ కస్టడీకి అనుమతిచింది. కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించారు.

ప్రధానంగా మందుల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు అందుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షాధారాలను వారి ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించారు. ఏడుగురు నిందితులను విడివిడిగా విచారించిన ఏసీబీ వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.
 
ఈ స్కామ్‌లో 23 చోట్ల సోదాలు చేసి ఆధారాలు సేకరించిన ఏసీబీ వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. డైరెక్టర్ దేవికారాని అరెస్ట్ తరువాత మరికొంతమంది ఫార్మా కంపెనీలకు చెందిన ఎండీలు, ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది. వారిచ్చిన సమాచారంతో నిందితులను విచారించింది.
 
ఈ స్కామ్‌లో ఒకవైపు నిందితుల విచారణ చేపడుతూనే, మరోవైపు సోదాలు మాత్రం కొనసాగిస్తోంది ఏసీబీ.. మొదటి బ్యాచ్ దేవికారాణీ అండ్ టీమ్‌ను జైలుకు పంపిన అధికారులు, అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు.

మొదట్లో డైరెక్టర్ దేవికారణీతో పాటూ అరుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు, ఫార్మాసిస్టులు, ఈఎస్ఐ ఉద్యోగులు ఉన్నారు.
 
తాజాగా ఆరవింద్ రెడ్డి అరెస్టు అవ్వడం.. అతని దగ్గర కీలక డాక్యూమెంట్లు లభ్యం కావడంతో.. ఆ డాక్యూమెంట్ల వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్‌లను ఏసీబీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. మొదటి రోజు కస్టడీలో కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ గురువారం మరోసారి నిందితులను కస్టడీలోకి తీసుకోనుంది.