మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2019 (11:50 IST)

ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్‌ను ఏం చేయాలి?.. రేవంత్‌రెడ్డి

‘‘చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మెకు దిగిన కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తానని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. ఆరేళ్లుగా సచివాలయానికి రాని ఆయనపైన పీడీ చట్టం ప్రయోగించి.. అండమాన్‌ జైల్లో పెట్టాలా?’’ అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

విచారణకు రాబోతున్న కేసుల విషయం లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ 35 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి మా ట్లాడేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా అని మండిపడ్డారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఉద్యమ సమయంలో పోరాట యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్క తోకలుగా కనిపిస్తున్నారా అని నిలదీశారు. 50వేల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి తెస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఏ ఉద్యోగాలనూ కేసీఆర్‌ తీయలేడని, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు.

ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీలో రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన వారు సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకున్న తర్వాతే ప్రైవేటీకరణ అంశం ముందుకు వచ్చిందని ఆరోపించారు. కొత్తగా 350 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఎవరి కోసమో ఆలోచన చేయాలని ఆయన అన్నారు.