మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 7 ఆగస్టు 2018 (18:33 IST)

హోంమంత్రిగా రోజా.. స్పీకర్‌గా ధర్మాన.. ఎలా?

వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపికి సలహాలిస్తున్న పి.కె.టీం వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీలో కేబినెట్ మంత్రులు వీరే అంటూ ప్రచారం చేస్తోంది. జూన్ మొదటి వా

వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపికి సలహాలిస్తున్న పి.కె.టీం వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీలో కేబినెట్ మంత్రులు వీరే అంటూ ప్రచారం చేస్తోంది. జూన్ మొదటి వారంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. ఆ తరువాత కేబినెట్ మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం చేస్తున్నారు. జగన్ కేబినెట్‌లో హోంమంత్రిగా రోజాకు అవకాశమిస్తారని, స్పీకర్‌గా ధర్మాన ప్రసాదరావు కొనసాగుతారట. 
 
అసలు ఏయే జిల్లాల నుంచి ఎవరెవరికీ అవకాశం ఇస్తున్నారంటే... శ్రీకాకుళం నుంచి దర్మాన క్రిష్ణదాసు, తమ్మినేని సీతారాం, విజయనగరం నుంచి బొత్సా సత్యనారాయణ, విశాఖపట్నం గుడివాడ అమర్, కరణం ధర్మశ్రీ, తూర్పు గోదావరి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, బొల్లి బాబూరావు, జక్కంపూడి విజయలక్ష్మి, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ముదునూరు ప్రసాదరాజు, ఆళ్ళ నాని, క్రిష్ణాజిల్లా నుంచి పార్థసారథి, కొడాలి నాని, పెర్ని నాని, కామినేని ఉదయభాను, గుంటూరు జిల్లా నుంచి ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి, సుచిత్ర, మర్రి రాజశేఖర్, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసుల రెడ్డి, సురేష్‌, నెల్లూరు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కడప జిల్లా నుంచి శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, అనంతపురం జిల్లా నుంచి పద్మావతి, విశ్వేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా నుంచి చరితారెడ్డి, శిల్పామోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా, స్పీకర్‌గా ధర్మాన ప్రసాద్ రావు, డిప్యూటీ స్పీకర్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఇలా ఉండవచ్చని వైఎస్ఆర్సీపి పి.కె. టీం చెబుతోందట.