1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. student dies after jumping in Palnadu

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

jump
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం తలెత్తిన క్రమంలో ఓ విద్యార్థిని ఏకంగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
 
ఆంధ్రప్రదేశ్​లోని బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. 
 
పెన్ను విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష హాస్టల్‌ భవనంలోని నాలుగో ఫ్లోర్​ నుంచి ఒక్కసారిగా కిందకు దూకింది. హాస్టల్‌ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని అనూష మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవైపు సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లోని బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. 9వ తరగతి చదువుతున్న బాలికను లింగంపల్లికి చెందిన స్వాతిగా గుర్తించారు. 
 
శనివారం ఉదయం హాస్టల్‌లోని సీలింగ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్