ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (12:33 IST)

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి మృతి...

deadbody
ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలంగాణాకు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఫిలిప్పీన్స్‌లో జరిగింది. పేరు స్నిగ్ద. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామవాసి. వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 
 
ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని అర్థరాత్రి సమయంలో ఆమెకు సుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె వద్దకు వెళ్లగా, అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. వారు వెళ్ళేసరికి ఆమె గదిలో శవమై కనిపించింది. ఈ విషయాన్ని వారు పటాన్‌చెరులోని కుటుంబ సభ్యులకు చేరవేశారు. 
 
స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈవోగా పని చేస్తున్నారు. స్నిగ్ధ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైద్య విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సివుంది.