బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (13:29 IST)

విలువలను పెంచడానికి చాగంటి గారిని సలహాదారుగా నియమించాం : చంద్రబాబు (video)

Chandra babu
Chandra babu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా కేబినెట్ ర్యాంక్‌తో కీలక పదవి దక్కింది. ఆయన్ను విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఈ పదవిని తీసుకుంటానని చాగంటి చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే ముఖ్యమైన బాధ్యతను తనకు అప్పగిస్తూ సలహాదారుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్‌లో స్థానం కల్పించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. 
 
మన దేశంలో ఓ కుటుంబ వ్యవస్థ గొప్పగొ ఉంటుంది. కానీ ఇటీవల మన వ్యవస్థ కూడా సమస్యల్లో పడుతోంది. విలువలు తగ్గిపోతున్నాయి. విలువలను పెంచడానికి చాగంటి కోటేశ్వరరావుగారిని సలహాదారుగా నియమించామని చెప్పారు. 
 
భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలు మెరుగుపడాలనే ఉద్దేశంతోనే ఆయనను కేబినేట్‌లోకి తీసుకున్నామన్నారు. ప్రపంచ దేశాల్లో భారత దేశపు కుటుంబ వ్యవస్థ చాలా పవర్ ఫుల్. వేరే ఏ దేశాల్లో ఈ వ్యవస్థ లేదు. ఆ కుటుంబ వ్యవస్థే పెద్దలకు విలువలను నేర్పుతుంది. ఆ విలువలే వారసత్వంగా వస్తాయి. మ్యారేజ్ ఇన్ హెవెన్ అనే నమ్మే దేశం భారత దేశం. అందుకే ఇతర దేశాలత పోల్చుకుంటే విడాకులు ఇక్కడ ఎక్కువగా వుండవన్నారు చంద్రబాబు. 
 
భార్యాభర్తలు కలిసే వుండాలనే సంస్కారాన్ని నేర్పింది భారత దేశమేనని చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి దిగజారుతుంది. విడాకులు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో లెక్కలేని తనం పెరిగిపోతుంది. అందుకే విలువలను కాపాడాలనే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావుని స్టూడెంట్స్ ఎథిక్స్‌ను ప్రమోట్ చేయడానికి నియమించడం జరిగింది. ఈ మేరకు ఆయన గవర్నమెంట్ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టారు. 
 
స్టూడెంట్స్ కోసం ఎవరైనా మాట్లాడాలి. విలువలు గురించి మాట్లాడలేకపోతే పరిస్థితి అదుపులో వుండదు. విలువలు దిగజారితే.. సెక్యూరిటీ, హ్యాపీనెస్ కొరవడుతుందని చంద్రబాబు అన్నారు.