గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (11:49 IST)

పవన్ కల్యాణ్ సర్‌తో మాట్లాడాను.. ఇదంతా గోతికాడ నక్కల ఆనందం: అనిత (video)

Anitha
Anitha
ఏపీ రాష్ట్రంలో వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైర్ అయ్యారు. పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు హోంమంత్రి అనిత బాధ‌త్యాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వు ప‌లికారు. 
 
ఆడ‌పిల్ల‌పై అత్యాచారం జ‌రిగితే కులం ఎందుకు వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. తాను హోంమంత్రి అయితే ప‌రిస్థితులు మ‌రోలా ఉంటాయ‌ని పవన్ హెచ్చ‌రించారు. విమర్శలు చేస్తున్నవారిని ఇలానే వదిలేస్తే తానే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ మాటలను పాజిటివ్‌గా తీసుకుని, బాధ్యతగా పనిచేస్తానని అనిత అన్నారు. ఇప్పటికే అయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. 
 
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలను ఏమాత్రం ఉపేక్షించేదీ లేదని అనిత అన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ ఆవేదనతో అలా మాట్లాడారని అనిత వివరించారు. అంతేకాదు, తాను సోషల్‌ మీడియా బాధితురాలినేనని అనిత అన్నారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న నేరాల విషయంలో అందరిలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బయట పడ్డారు.. మేము పడలేదు. లా అండ్‌ ఆర్డర్‌ పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. 
 
ఈ ఘోరాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు కావాలన్న హోంమంత్రి, ఈ అంశాలంటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడిన సందర్భం ముఖ్యమని.. పవన్ వ్యాఖ్యలను ముందు వెనుక కట్ చేసి గుంతనక్కల్లా లబ్ధి పొందాలని చాలామంది కాచుకుంటూ కూర్చున్నారని అనిత ఎద్దేవా చేశారు. 
 
గోతి కాడ నక్కల్లా కాసుకుని కూర్చుంటున్నారని.. ఏదైనా సంఘటన జరుగుతుందా దాన్ని ఎలా ఉపయోగించుకుందాం అని ఆ నక్కలు చూస్తుంటాయని ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలుసుకోకుండా ఆనందపడిపోతున్నారని అనిత మండిపడ్డారు. అనిత ఫెయిల్యూర్ అయ్యిందని పవన్ చేసిన కామెంట్లు ఎక్కడైనా వుందా అని మీడియాను ప్రశ్నించారు. 
 
ఏపీలో జరుగుతున్న అకృత్యాలు పునరావృతం కాకుండా చూస్తామని అనిత అన్నారు. పవన్ ప్రెస్‌మీట్‌ను పాజిటివ్‌గా తీసుకున్నానని.. ఆయన మాటలు తనను ఇంకాస్త అగ్రెసివ్‌గా వెళ్ళమనే మద్దతిచ్చారని అనిత అన్నారు. పవన్ సర్‌తో మాట్లాడానని.. మాట్లాడిన సందర్భాన్ని గత ప్రభుత్వ కుల అరెస్టుల గురించి చెప్పారని అనిత వెల్లడించారు. ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు గారూ భద్రత విషయంలో సీరియస్‌గా వున్నారని.. రాష్ట్రంలో నేరం చేసేందుకు భయపడేలా చట్టం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా వున్నట్లు అనిత వెల్లడించారు.