సంబంధిత వార్తలు
- విద్యార్థి మెడపై గొడ్డలిపెట్టి బెదిరించిన ఉపాధ్యాయుడు
- స్నేహితురాలితో స్వలింగ సంపర్కం : వివాహమైన వారానికే పారిపోయిన నవ వధువు
- లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇల్లు కూల్చేశారు
- ప్రేమ వివాహం కోసం తల్లిదండ్రుల సమ్మతం తీసుకోవాలంటే ఏం చేయాలి?
- ప్రేయసిని పలుమార్లు లొంగదీసుకున్నాడు.. గర్భం దాల్చేసరికి చేతులెత్తేశాడు.. చివరికి?
మైనర్ బాలికతో ఉపాధ్యాయుడి బాల్య వివాహం
చిన్నారులకు, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పిన ఒక తప్పు చేసి, ఆ తప్పుని దిద్దుకునే కార్యక్రమంలో భాగంగా మరో తప్పుని కూడా చేసేసారు.
వివరాలలోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం దాలిపాడులోని స్థానిక గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ఆ పాఠశాలలో పని చేస్తూ, వార్డెన్‌గా కూడా విధులు నిర్వహిస్తున్న బెలెం చినబ్బాయి అనే ఉపాధ్యాయుడు రహస్య వివాహం చేసుకున్నాడు. కాగా... సదరు విద్యార్థినిని చినబ్బాయి... మాయమాటలతో లోబరుచుకుని ఏడాది కాలంగా ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు.
ఈ విషయం కాస్తా విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిసిపోయి... చినబ్బాయిని నిలదీయడంతోపాటు విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, చినబ్బాయి పెద్దల సమక్షంలో బాలికను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. మరి మైనర్ బాలికతో ఈ ఉపాధ్యాయుడిగారి వివాహానికి అధికారులు ఏం బహుమతి ఇవ్వనున్నారో తెలియాల్సి ఉంది.
