గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (16:46 IST)

విద్యార్థి మెడపై గొడ్డలిపెట్టి బెదిరించిన ఉపాధ్యాయుడు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే విద్యార్థి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థి ఎలాంటితప్పు చేశాడో తెలియదుగానీ, ఆ విద్యార్థి మెడపై గొంతుపెట్టి బెదిరించారు. ఈ దృశ్యాన్ని చూసిన మిగిలిన విద్యార్థినీ విద్యార్థులు భయభ్రాంతులకులోనై... తమను వదిలిపెట్టాల్సిందిగా వారు ప్రాధేయపడ్డారు. ఈ ఘటనకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోచోటుచేసుకుంది. ఈ బెదిరింపులకు పాల్పడిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
విద్యార్థి చేతులను ఓ వ్యక్తి గట్టిగా పట్టుకుని ఉండగా.. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరిస్తూ విద్యార్థి మెడపై గొడ్డలి పెట్టి ఉపాధ్యాయుడు బెదిరించాడు. ఉపాధ్యాయుడి వ్యవహారం కారణంగా.. భయాందోళనకు గురైన సదరు విద్యార్థి ఏడుస్తూ తనను విడిచిపెట్టాల్సిందిగా అభ్యర్థించాడు
 
ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీ స్పందించారు. విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించిన ఆమె.. సదరు ఉపాధ్యాయుడుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.