గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (11:46 IST)

డ్యాన్స్ చేద్దాం.. హగ్ చేసుకుందాం.. ప్రభుత్వ టీచర్ అదుర్స్ (వీడియో)

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దగా కోచింగ్ వుండదని అందరూ అనుకుంటారు. ఇటీవల చెన్నైకి సమీపంలోని ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ ట్రాన్స్ ఫర్ అవుతుంటే.. ఆయన్ని స్కూల్ నుంచి కదలనీయకుండా విద్యార్థులు అడ్డుకుని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుతం పుదుచ్చేరికి చెందిన ఓ టీచర్.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి నోనంకుప్పంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుభాషిణి పనిచేస్తోంది. రోజూ ఉదయం పూట తన తరగతికి వచ్చే పిల్లలను ఆమె నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం, డ్యాన్స్ చేస్తూ వాళ్లని తరగతి గదిలోకి రమ్మనడం, విద్యార్థినులైతే ఆప్యాయంగా కౌగిలించుకోవడం వంటివి చేయడం ద్వారా ఆ టీచర్ అంటేనే విద్యార్థులు ఖుషీ ఖుషీ అయిపోతున్నారు. 
 
హగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, డ్యాన్స్ చేయడం వంటి పలు చిత్రాలను తరగతి మొత్తం అతికించుకున్న ఆమె పిల్లల అభీష్టం మేరకు వారి పట్ల ఆడుతూ పాడుతూ గడుపుతున్నారు. ఉదాహరణకు విద్యార్థులు తరగతి గదిలో వున్న డ్యాన్ చేసే చిత్ర పటాన్ని తాకితే.. ఆ టీచర్ కూడా డ్యాన్స్ చేస్తూ సదరు విద్యార్థిని క్లాజ్ రూమ్‌లోకి ఆహ్వానిస్తారు. 
 
ఇలా పిల్లలను ఆకట్టుకునే రీతిలో పాఠాలు చెప్పిస్తూ వస్తున్న సుభాషిణిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు  సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.